మోసగత్తె అరెస్ట్.. 6 కోట్లు దోపిడీ…

Written by TV2O TELUGU

Published on:

తెలంగాణ : ఎల్బీనగర్…
రియల్ ఎస్టేట్ వ్యాపారం, చిట్టి లు నడుపుతూ అందరిని నమ్మించి దాదాపుగా 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి (45) అరెస్ట్ చేసి వనస్థలిపురం పోలీసులు రిమాండ్ కు తరలించారు.
నిందితురాలు 1994 సంవత్సర మూలో కొహెడ చెందిన బద్దం జనార్దన్ రెడ్డి వివాహం చేసుకొని హయత్ నగర్ లో ఉన్నది.. ఆ తర్వాత
వనస్థలిపురం లోని కమలా నగర్ లో ఉంటూ బద్దం జ్యోతి రెడ్డి 9 సంవత్సరాల నుండి రియర్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పరిచయం ఉన్నవారితో చిట్టి లు నడిపిస్తూ, తెలిసిన వారితో రియల్ ఎస్టేట్ వ్యాపారం లో పెట్టుబడి పెట్టించి వారికి లాభాలు కూడా ఇవ్వడంతో తనపై నమ్మకంతో చాలా మంది ఆమె వద్ద చిట్టి లు వేశారు..
2020 సంవత్సరం నుండి దాదాపుగా 20మంది వ్యక్తుల ను నమ్మించి దాదాపుగా 6.5కోట్ల మోసం చేసి పరారయినదని వీరే కాకుండా చాలామంది బాధితుల వద్ద నుండి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు చిట్టి లు పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు విచారణ లో ఒప్పుకున్నదని పోలీసులు తెలిపారు..
నిందితురాలు బద్దం జ్యోతి రెడ్డి పై U/s 318(4),316(2),r/w 3(5)of BNS Sec -76of chit fund act 1982 కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు వనస్థలిపురం పోలీసులు..!

Leave a Comment