చిన్నారి మిస్సింగ్ కేసు.. కీలకంగా మారిన పెంపుడు కుక్క

Written by TV2O TELUGU

Published on:

AP: కాకినాడ జిల్లాలో ఈ నెల 6న అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఐదు రోజులు గడిచినా చిన్నారి జాడ లభించకపోవడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో జ్ఞానేశ్వరితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క కీలకంగా మారింది. మంగళవారం ఇంటికి వచ్చి మళ్లీ అదృశ్యమైన కుక్క, బుధవారం రాత్రి మరోసారి ఇంటికి చేరుకుంది. దీంతో కుక్కను వెంటబెట్టుకుని చిన్నారి ఆచూకీ కోసం గురువారం (ఇవాళ) ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ నిర్వహించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. జ్ఞానేశ్వరి అడవి జంతువుల బారిన పడిందా? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

Leave a Comment