
గత వై సీ పీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి నోచుకోక నిర్మాణ దశలో ఆగిపోయిన దళవాయి సుబ్బరామయ్య మున్సి పల్ కార్పొరేషన్ హైస్కూ ల్ ను అభివృద్ధి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంద ని కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్ అన్నారు. కుమ్మరిపాలెం లోని డీ ఎస్ ఎం సి హెచ్ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు పాఠ శాల పునర్నిర్మాణం చేప ట్టాలని ఆదివారం విద్యా ధరపురం లోని స్కూల్ వద్ద ఎం ఎస్ బేగ్ కు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు వినతి పత్రం అందజే శారు. తామంతా ఇక్కడే చదువుకున్నామని ఎంత మంది అధికారులను కలిసిన న్యాయం జరగ డంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలను అభి వృద్ధి చేయాలని దశాబ్దా ల క్రితం నిర్మించిన పాఠశా ల భవనం శిధిలావస్థకు చేరడంతో అప్పటి ప్రభు త్వం నాడు నేడు కార్యక్ర మంలో భాగంగా అభివృ ద్ధి చేస్తామని చెప్పి పునా దులకే పరిమితం చేసింద ని పూర్వ విద్యార్థులు తమ గోడును వెళ్ళబు చ్చుకున్నారు. ఎన్నోమా ర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా కృష్ణాజిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్ మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభు త్వం దీనిపై దృష్టి సారిం చిందన్నారు. ఎం పి కేశి నేని శివనాద్ (చిన్ని) ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లి సమస్య ను వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతామ న్నారు. సామాజిక బాధ్య తగాపునర్నిర్మాణం చేప డతామని ఎం ఎస్ బేగ్ తెలపడంతో డీ ఎస్ ఎం సి హెచ్ పాఠశాల పూర్వ విద్యార్థులు, కూటమినే తలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు….