నాలుగేళ్ల క్రితం బ్యాంకు ఆఫీసర్ పేరుతో చీటర్లు ట్రాప్ చేసారు.!…నాగార్జున అక్కినేని
ఆ మధ్య తమ కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్ కు గురయ్యారు అంటూ వెల్లడించిన నాగార్జున తాజాగా ఈరోజు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను కూడా సైబర్ కేటుగాళ్లు ఫోన్ బ్యాంక్ అధికారులం అంటూ నమ్మించి మోసం చేసారని.. నాలుగేళ్ల క్రితం ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు..!