మంగళగిరి పట్టణానికి చెందిన హేమ వర్షిణి తొలి ప్రయత్నంలోనే సీఏ, సీఎంఏలో సత్తా

Written by TV2O TELUGU

Published on:

జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ కోర్సులైన చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) పరీక్షల్లో కొక్కుల హేమ వర్షిణి ప్రతిభ కనబరిచారు.రెండు కోర్సుల్లోనూ తొలి ప్రయత్నంలోనే రెండు గ్రూపులను విజయవంతంగా పూర్తి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు.జూన్ 18న విడుదలైన సీఏ ఫలితాల్లో రెండు గ్రూపులను తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించిన హేమ వర్షిణి, ఆగస్టు 5న విడుదలైన సీఎంఏ ఫలితాల్లోనూ రెండు గ్రూపులను విజయవంతంగా పూర్తి చేశారు. సీఎంఏలో మొత్తం 800 మార్కులకు గాను 519 మార్కులు సాధించి 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. దేశవ్యాప్తంగా రెండు గ్రూపులకు కలిపి 32 శాతం ఉత్తీర్ణత నమోదైన నేపథ్యంలో హేమ వర్షిణి సాధించిన విజయం విశేషంగా నిలిచింది.

ఆర్థిక నిర్వహణలో కీలకమైన సీఎంఏ

వ్యాపార సంస్థల ఆర్థిక నిర్వహణ, వ్యయ నియంత్రణ, లాభదాయకత పెంపు, బడ్జెట్ రూపకల్పన, పన్నుల విధానం, ఆర్థిక నివేదికలు, ఆడిటింగ్, వ్యూహాత్మక నిర్ణయాల వంటి అంశాల్లో నైపుణ్యం కల్పించే ప్రొఫెషనల్ కోర్సుగా సీఎంఏకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) ఈ కోర్సును నిర్వహిస్తోంది.సంస్థలలో ఖర్చులను నియంత్రించడం, ఆర్థిక ప్రణాళికలు రూపొందించడం, లాభదాయకతను మెరుగుపరచడం,యాజమాన్యానికి కీలక ఆర్థిక సమాచారాన్ని అందించడం వంటి బాధ్యతల్లో సీఎంఏ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారు. ఇలాంటి ప్రతిష్టాత్మక కోర్సులో హేమ వర్షిణి తొలి ప్రయత్నంలోనే రెండు గ్రూపులను పూర్తి చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. హేమ వర్షిణి సాధించిన విజయంతో ఆమె తల్లిదండ్రులు రామకృష్ణ,
లక్ష్మి శివ నాగరాజ ఆనందం వ్యక్తం చేశారు

Leave a Comment