వాడపల్లి వెంకన్నకు రూ.71.94 లక్షల విలువైన బంగారు హారం బహూకరణ…

Written by TV2O TELUGU

Published on:

నసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీ తెల్ల శ్రీనివాసరావు, శ్రీమతి శ్రీలక్ష్మి దంపతులు, మైత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 463.920 గ్రాముల బంగారు హారాన్ని బహూకరించారు. ఈ హారం విలువ సుమారు రూ.71,94,550.

బంగారు హారాన్ని దాత కుటుంబ సభ్యులు ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు మరియు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు తమ్మన సాయి ప్రసాద్, మసకపల్లి త్రిమూర్తులు, వాడపల్లి సుందర శేషావతారం, పెండెం కుమారి, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది, ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Comment