
గుంటూరు ప్రభత్వ ఆస్పత్రి నుంచి పోలీసులను మోసం చేసి పారిపోయిన మోస్ట్ వాంటెడ్
నిందితుడు భీముడు అలియాస్ అజిత్ కుమార్ చివరకు తమిళనాడులో చిక్కాడు.
గత నెల 28వ తేదీన తప్పించుకుని పరారీ ఐనా ఈ గజదొంగ కోసం పోలీసులు నాలుగు
రాష్టాల్లో గాలింపు చేపట్టారు .
olx మోసాల పేరుతో ప్రజలను లక్షయంగా చేసుకుని భారీగా మోసాలు చేసిన భీముడు ఇప్పటికే
పలుచోట్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు .టెక్నాలిజీ ని ఉపయోగించి అమాయకులను మభ్యపెట్టడంలో నైపుణ్యం
సంపాదించుకున్నాడని పోలీసులు చెబుతున్నారు .
తమిళనాడులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం అతడిని గుంటూరు కు తరలించే
ప్రక్రియలో ఉన్నారు .మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు .