పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ వీర్ల అంకమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో 26వ కొలుపుల తిరుణాల్ల మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అయిదు రోజుల పాటు జరిగే ఈ కొలుపుల తిరునాళ్ళ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఎడ్ల పందాలు , అమ్మవారికి ప్రత్యేక పూజలు , భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ మన గ్రామ దేవత అయిన శ్రీ వీర్ల అంకమ్మ తల్లి దేవస్థానంలో కొలుపుల తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా ఈ అయిదు రోజుల పాటు ప్రత్యేక పూజలు , అద్భుత జాతర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. జలాభిషేకం , జలబిందెల ఊరేగింపు , అమ్మవారికి పుట్టింటి పసుపుకుంకుమ , పల్లకిసేవ , అమ్మవారికి బోనాలు సమర్పణ కుంభోత్సవం , శాంతికల్యాణం తో ఈ కొలుపుల తిరునాళ్ళ కార్యక్రమం ముగుస్తుంది అని వారు తెలిపారు. ఈ అయిదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు కోరారు.
పల్నాడు జిల్లాలో శ్రీ వీర్ల అంకమ్మ ఉత్సవాలు
Written by TV2O TELUGU
Published on: