శ్రీ దుర్గామల్లేశ్వరులు కొలువైన ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధిపనులను అధికార బృందం పరిశీలించింది.

Written by TV2O TELUGU

Published on:

శ్రీ దుర్గామల్లేశ్వరులు కొలువైన ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధిపనులను అధికార బృందం పరిశీలించింది.
మొదట దేవస్థానం Eo గారి కార్యాలయంలో NIRM, బెంగుళూరు బృందం, SPA, విజయవాడ అధికారులు,దేవస్థానం ఈవో శ్రీ శీనా నాయక్,
శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం మాస్టర్ ప్లాన్ అమలు ప్రధాన సలహాదారు, ఇంజనీరింగ్ నిపుణులు శ్రీ కొండలరావు, దేవదాయశాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీ శేఖర్, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ శ్రీ కోటేశ్వరరావు, శ్రీమతి రమాదేవి వార్లు సమావేశం అయి పలు విషయాలు పై సమగ్రంగా చర్చించారు.అనంతరం ప్రసాదం పోటు, అన్న ప్రసాద భవనం తదితర నిర్మాణాలు పూర్తి కావడం గురించి చర్చించారు. ఘాట్ రోడ్ పరిశీలన చేశారు.యీ సందర్బంగా శ్రీ కొండలరావు బృందం శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో శీనానాయక్ గారు వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదములు అందజేశారు.ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధికి, భక్తులకు అన్ని రకముల సదుపాయాలు కల్పించి, సులభతరంగా శ్రీ దుర్గామల్లేశ్వరుల దర్శనం కల్పించేందుకు రూపొందించిన ప్రణాళికలు త్వరితగతిన అమలు పర్చేందుకు ఈ క్షేత్రస్థాయి పర్యటన జరిగిందని అధికారులు తెలియజేసారు.మాస్టర్ ప్లాన్ అమలుకు NIRM, SPA బృందాల నివేదికలు కీలకం కానున్నాయని తెలిపారు.

Leave a Comment