గుంటూరులో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల మెరుపు దాడులు..! భారీగా నకిలీ విత్తనాలు సీజ్.

Written by TV2O TELUGU

Published on:

విజిలెన్స్ డీజీ హరీష్ గుప్తా ఆదేశాలతో నకిలీ విత్తనాల నివారణ ఫై రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు విజిలెన్స్ అధికారులు.. రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా లక్ష్యంగా వ్యవసాయ అధికారులతో కలిసి గుంటూరు విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ దాడుల్లో గుంటూరు ‘వాసవి సీడ్స్’ లో విత్తన చట్టాల ఉల్లంఘనను గుర్తించారు… తనిఖీ సమయం లో ఎటువంటి రికార్డ్స్ లేకుండా మాయం చేశారు. చెల్లుబాటు అయ్యే ప్రాసెసింగ్, ప్యాకింగ్ లైసెన్స్ లేకుండానే విత్తనాల వ్యాపారం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు..
వాసవి సీడ్స్ నుంచి 26,791 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. 5 రకాల వరి విత్తనాలు సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ విత్తనాల విలువ రూ. 24.78 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు.
నిత్యావసర వస్తువుల చట్టం కింద జాయింట్ కలెక్టర్ కోర్టులో 6A కేసు నమోదుకు చేశారు.రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా లక్ష్యంలో భాగంగా కఠిన చర్యలకు ఉపక్రమించినట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు..

Leave a Comment