
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో జన సైనికులు నిమగ్నం అవడం శుభపరిణామం అని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. మంగళవారం విజయవాడ దుర్గగుడి ఆలయం ప్రాంగణం వద్ద జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు తో కలిసి ప్రారంభించారు. అనంతరం స్వయంగా భక్తులకు మజ్జిగను అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరించే కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే జనసేన పార్టీ లక్ష్యమని తెలిపారు. గత కొన్ని రోజులుగా నిర్విరామంగా బాడిత శంకర్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం భక్తులకు ఉచితంగా నిర్వహించడం శుభ పరిణామం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మూర్తి, డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ, గాదిరెడ్డి అమ్ములు, కొంపల్లి అరుణ్ కుమార్ (నాని), దోమకొండ అశోక్, కమ్మిలి రంగా, సమతం సత్తిబాబు, బీసీ రాష్ట్ర నాయకులు కొమ్మవరపు భాను ప్రసాద్, రుద్ర శేఖర్ నాయుడు, శ్రీనివాస్ రావు, సోడిశెట్టి రాధా, హనుమంతు, వీర మహిళలు అచిత, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు!!