తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియా సమావేశం..

Written by TV2O TELUGU

Published on:

తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు.మెప్మా ఎన్నికలు సజావుగా నిర్వహిస్తే ఎంపీ కేశినేని చిన్ని కి అభ్యంతరమేంటి అని ప్రశ్నించారు . తిరువూరులో ఎన్నికలు జరగకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీశారు ..మెజార్టీ సభ్యులను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముందని ,బాధ్యతాయుత ఎమ్మెల్యేగా ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు. .మొత్తం 33 మంది సభ్యులకు గాను 22 మంది మద్దతుతో ఏకగ్రీవంగా డెక్కా నవ్య ఎన్నికైనట్లు పేర్కొన్నారు ఎమ్మెల్యే కొలికపూడి.తిరువూరులో జరిగే అసాంఘిక కార్యక్రమాలకు ఈ బాధ్యత ఎవరు వహిస్తారని ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు ..మైలవరం పోలీసులు పేకాట ఆడే మహిళను పట్టుకుని ఆ మహిళపై కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ ప్రశ్నించారు. పేకాటను అక్కడితో ఆపేయడంతో పోలీసులకు థాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే కొలికపూడి,ఫలానా తప్పు చేశాడని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చూపించాలంటూ బహిరంగ సవాలు విసిరారు..మీ ఆరాచకాలను నేను నిత్యం ప్రశ్నిస్తున్నానన్నారు..నేను ఈ రెండేళ్లలో ఎవరినైనా చట్టానికి వ్యతిరేకంగా పనిచేయాలని అధికారులకు చెప్పానా.?మెప్మా అధికారులు ఉద్యోగం చేస్తున్నారా లేదా రాజకీయం చేస్తున్నారా అంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే..ప్రశాంతమైన వాతావరణం కలిగిన తిరువూరులో బయట వారు చెడగొడితే సహించేది లేదన్నారు . చంద్రబాబు ఆశయాల సాధన కోసమే నిరంతరం పనిచేస్తున్నాను తప్ప వ్యక్తిగత జెండా నాకు అనేది లేదన్నారు…

Leave a Comment