జర్నీ గణప్రసాద్ జ్ఞాపకార్థం మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం – డీఎస్పీ రాంబాబు

Written by TV2O TELUGU

Published on:

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం హెచ్ గ్రౌండ్ ఆవరణలో
, మాజీ క్రికెటర్ కీర్తిశేషులు జర్నీ గణప్రసాద్ జ్ఞాపకార్థం గుమ్మలక్ష్మీపురం H గ్రౌండ్ యువత ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పాలకొండ డీఎస్పీ ఎం. రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు.
మొదటగా డీఎస్పీ రాంబాబు గణప్రసాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం టోర్నమెంట్‌ను ప్రారంభిస్తూ టాస్ వేసి బ్యాటింగ్‌కు శ్రీకారం చుట్టారు.
ఈ టోర్నమెంట్‌లో సుమారు 100 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నియోజకవర్గంలోని యువత పెద్ద ఎత్తున పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటుతున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ, తమ పోలీస్ శాఖకు చెందిన గణప్రసాద్ పేరుతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. యువతను ప్రోత్సహించేందుకు పోలీస్ శాఖ తరఫున 150 బంతులను అందజేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
టోర్నమెంట్‌లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.50,000, ద్వితీయ బహుమతిగా రూ.25,000 నగదు బహుమతులు ప్రకటించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి, సబ్ ఇన్స్పెక్టర్ నీలకంఠం, మండల తహసీల్దార్ ఎన్. శేఖర్, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, తెలుగుదేశం నాయకులు పాడి సుదర్శన్ రావు పోలీస్ సిబ్బంది, H గ్రౌండ్ యువత, ప్రేక్షకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Comment