
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇచ్చాయి. మే 23 నుంచి దేశవ్యాప్తంగా చమురు ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరుకు సగటున 90 పైసల వరకు ధర పెరిగింది. మే 15 నుంచి ఇప్పటివరకు కేవలం పది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 5 రూపాయల మేర పెరగడం గమనార్హం.పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల మరియు సరఫరా వ్యవస్థలో అంతరాయాలే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. చమురు సంస్థలు భారీ నష్టాలను భరించలేక, ఈ భారాన్ని క్రమంగా వినియోగదారులపై వేస్తున్నాయి.ఇంధన ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.