
ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ పూర్తయినట్టు తెలుస్తుంది..
ఈ నెల 30న ఏపీ ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించనుంది.
*ఫిబ్రవరి 20న ఏకసభ్య కమిషన్ను నియమించింది ఏపీ ప్రభుత్వం..తిరుమలలో పలుమార్లు క్షేత్రస్థాయి పరిశీలనలు చేసి, నెయ్యి కొనుగోలు ప్రక్రియపై కమిషన్ సమగ్ర విచారణ చేపట్టింది.ఈ విచారణలో భాగంగా నిపుణుల కమిటీ సభ్యుడు విజయభాస్కర్ వాంగ్మూలం ఏకసభ్య కమిషన్ రికార్డు చేసినట్లు సమాచారం.. ఏ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో అని సర్వత్ర చర్చనీయాంశంగా ఉంది.