
ఏడుగురు CMలతో కలిసి నటించిన ఏకైక నటి…
తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుల ప్రస్థానం ప్రధానమైనది ప్రాధాన్యతతో కూడినది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎక్కువమంది సినీ నటులు తమిళనాడు రాజకీయాలను శాసించిన చరిత్ర ఉంది. సినీ రంగంలో విశేష అభిమానులను సంపాదించుకొని సామాన్య ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని రాజకీయ రంగ ప్రవేశం చేసి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆదేశించటం తమిళనాడు సినీ పరిశ్రమకు పెట్టింది పేరు.. ఇదే ఆనవాయితీ అలనాటి ఎంజీఆర్ నుంచి తాజా సీఎం జోసఫ్ విజయ్ వరకు కొనసాగింది.. శని ప్రముఖులు సీఎం అయిన సందర్భంలో ఏడుగురు సీఎంలతో కలిసి రంగస్థలం, వెండితెర లపై నటించిన ఏకైక నటి పేరు తెరపైకి వచ్చింది.. ఆ విశిష్టమైన నటి ఎవరో కాదు మనోరమ… సినీ చరిత్రలో వెయ్యికి పైగా చిత్రాలతో గిన్నిస్ రికార్డు సృష్టించిన నటి మనోరమ. రంగస్థలంపై అన్నాదురై, కరుణానిధిలతో నటించిన ఆమె, వెండితెరపై MGR, NTR, జయలలిత వంటి దిగ్గజాలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తర్వాతి కాలంలో ఎం.కె. స్టాలిన్, విజయ్ తోనూ కలిసి నటించారు.మొత్తం ఏడుగురు ముఖ్య మంత్రులతో పనిచేసిన ఏకైక నటిగా మనోరమ చరిత్రకెక్కారు. తరాలు మారినా ఆమె నటన అజరామరం..