
30 ఏళ్ల తర్వాత దక్కిన న్యాయం!
….
సంచలనాల కోసం ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేసే హక్కు మీడియాకు ఉందా?
దశాబ్దాల క్రితం జరిగిన ఒక తప్పుకు.. ఇప్పుడు మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు సోషల్ మీడియా యుగంలో ఉన్న మనందరినీ ఆలోచింపజేస్తోంది.
….
సీనియర్ నటి సుకన్య విషయంలో సన్ టీవీ నెట్‌వర్క్‌కు మద్రాసు హైకోర్టు రూ.10 లక్షల జరిమానా విధిస్తూ కింది కోర్టు తీర్పును సమర్థించింది.
- నాడు దేశాన్ని వణికించిన గంధపు దుంగల స్మగ్లర్ వీరప్పన్‌ను నక్కీరన్ పత్రిక ప్రతినిధి గోపాల్ 1996లో ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూను సన్ టీవీ టెలికాస్ట్ చేసింది. అయితే, అందులో వీరప్పన్ నటి సుకన్యపై కొన్ని తీవ్రమైన, ఆధారాలు లేని వ్యక్తిగత ఆరోపణలు చేశాడు.
- తన పేరుప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఉన్న ఆ వ్యాఖ్యలను ఎలా ప్రసారం చేస్తారంటూ నటి సుకన్య అప్పట్లోనే చెన్నై సివిల్ కోర్టులో మాననష్ట దావా వేశారు.
- దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత, సుకన్యకు రూ.10,00,500 నష్టపరిహారం చెల్లించాలంటూ 2015లో కోర్టు సన్ టీవీని ఆదేశించింది.
- ఈ తీర్పును సవాల్ చేస్తూ సన్ టీవీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 5న సన్ టీవీ అప్పీల్‌ను కొట్టేస్తూ, జరిమానా చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
….
“వీరప్పన్ చేసిన ఆరోపణలను ప్రసారం చేయడానికి ముందే ఎడిట్ చేసే పూర్తి అధికారం, అవకాశం సన్ టీవీకి ఉంది. కానీ రేటింగ్స్ కోసమో, సంచలనం కోసమో ఆ పని చేయకుండా అలాగే ప్రసారం చేయడం ముమ్మాటికీ తప్పే!” అని హైకోర్టు తేల్చి చెప్పింది.
….
ఇప్పుడు యూట్యూబ్ థంబ్‌నైల్స్, సోషల్ మీడియా ట్రోల్స్, బ్రేకింగ్ న్యూస్‌ల పేరుతో ఒకరి వ్యక్తిగత జీవితాన్ని బజారున పడేయడం చాలా సులువు అయిపోయింది.
కానీ, ఒకరి పరువు తీసే హక్కు ఎవరికీ లేదు.
1996లో జరిగిన అన్యాయానికి, 2015లో ఒక తీర్పు వస్తే.. 2026లో కానీ పూర్తి హై కోర్ట్ లో తాజా గా తీర్పు వచ్చింది…