
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఇంటర్ విద్యార్థిని రూపా కీర్తికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూశారు. ఈ విషయం గ్రహించిన రూపా కీర్తి తనకు పెళ్లి చేస్తారని భయం ఏర్పడింది. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పుకుంటున్న
పెళ్లి మాటలు విని మనస్తాపానికి గురైంది. ఇప్పుడే పెళ్లి వద్దని, ఇంకా చదువుకుంటనని తల్లిదండ్రులకు చెప్పింది.. మంచి సంబంధాలు ఉన్నాయేమో అని చూస్తున్నామంతే అని ఇప్పుడే పెళ్లి చేసేది లేదని చెప్పారు…అయినా తనలో భయం మాత్రం పోలేదు.. మానసిక ఒత్తిడికి గురైంది రూపా కీర్తన.పురుగుల మందు తాగిన రూపకీర్తన ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది.. పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన రూపా కీర్తనను స్థానిక ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు.. పరిస్థితి విషమించటంతో అనంతపురం నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది..
గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో జరిగిన ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ విషాద ఘటనతో బాల్య వివాహాలపై మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు…