ఏపీ రైతులకు అద్భుత అవకాశం.. ట్రాక్టర్లు, యంత్రాలపై 50శాతం రాయితీ, దరఖాస్తు చేస్కోండి

Written by TV2O TELUGU

Published on:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం పథకాలను అమలు చేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు అందిస్తోంది.. సబ్సిడీపై యంత్రాలు, పరికరాలు అందజేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్, రబీ సాగు ఆధారంగా 28 జిల్లాలకు రూ.112.50 కోట్లు కేటాయించింది. రైతులకు అవసరమైన ట్రాక్టర్ల, స్ప్రేయర్లు, గొర్రులు, కోత, నూర్పిడి యంత్రాలు వంటివి రాయితీపై అందిస్తారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు వ్యవసాయ యంత్రాల యూనిట్‌ ధరలో 50% రాయితీ ఇస్తారు. మిగిలిన రైతులకు 40% రాయితీ అందిస్తోంది. ఈ రాయితీ పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

రైతులకు రాయితీపై అందిస్తున్న యంత్రాలలో ట్రాక్టర్లు, పంట కోత యంత్రాలు, విత్తనాలు నాటే యంత్రం, స్ప్రేయర్లు, ఎండుగడ్డి, మేత సామగ్రి, నూర్పడి యంత్రాలు, కోత యంత్రాలు వంటివి అందజేస్తారు. జాయింట్ కలెక్టర్ లాటరీ ద్వారా లబ్ధిదారుల్ని ఎంపికచేసి రాయితీపై యంత్రాలు అందిస్తారు. ఆయా జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆమోదం తర్వాత లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు. ఈ పథకం కింద ఎంపికైన రైతుల మొబైల్‌కు మెసేజ్‌ వస్తుంది. అర్హుల్ని భూమి రికార్డులు, అటవీ హక్కుల పత్రాలు, ఈ-పంట వంటి వివరాల ద్వారా ఎంపిక చేస్తారు. రైతులు ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోను మిగిలిన డబ్బుల్ని15 రోజుల్లో డీలర్లకు చెల్లించాలి. ఆ తర్వాత 15 రోజులకు యంత్రాన్ని రైతుకు ఇస్తారు. రైతులు రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీపై యంత్రాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. రైతులు వారికి నచ్చిన డీలర్‌ వద్ద పరికరాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ఈ రాయితీ యంత్రాల కోసం మే 5 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తునన్నారు. ఈ నెల 23 నుంచి 25 వరకు లాటరీ ద్వారా రైతుల్ని ఎంపిక చేస్తారు. మే 26 నుంచి జూన్9లోగా రైతులు తమ వాటా డబ్బుల్ని డీలర్‌కు చెల్లించారు. అనందతరం మే 26 నుంచి జూన్‌ 26 వరకు యంత్రాలు రైతులకు అందజేస్తారు. జూన్ 30 నుంచి డీలర్‌కు రాయితీ డబ్బులు విడుదల చేస్తారు. రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు వెబ్‌సైట్‌ https://eseed.ap.gov.in/FM/ ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ పథకానికి కౌలు రైతులూ అర్హులేనని అధికారుల తెలిపారు. కౌలు రైతుల్లో కూడా గత మూడేళ్లలో కనీసం మూడు సీజన్లలో ఈ-పంటలో నమోదైన వారు మాత్రమే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ (అటవీ హక్కుల పత్రాలు) ఉన్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులు. రైతుల్లో కొంతమంది 2024-25లో రాయితీ పొందారు.. వారు ఈ పథకానికి అనర్హులు. అలాగే రైతు కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Leave a Comment