
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మర్చిపోకముందే, మరో ప్రమాదకర వైరస్ ‘హంతా’ ఇప్పుడు వాwర్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఒక డచ్ క్రూయిజ్ షిప్లో ఈ వైరస్ కారణంగా ముగ్గురు ప్రయాణికులు మృతి చెందడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్రంగా స్పందించింది. 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు ఉన్న ఆ షిప్లో వైరస్ ఆనవాళ్లు కనిపించడంతో ఆయా దేశాలను WHO అప్రమత్తం చేసింది.హంతా వైరస్ ప్రధానంగా ఎలుకల ద్వారా మనుషులకు సోకుతుంది. ఎలుకల మూత్రం, లాలాజలం లేదా విసర్జితాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఎలుకలు తిరిగిన ప్రదేశాల్లోని గాలిని పీల్చడం ద్వారా లేదా అవి కరిచినప్పుడు ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. క్రూయిజ్ షిప్లో ముగ్గురు మరణించడంతో అంతర్జాతీయంగా ఆందోళన మొదలైంది.గాలి ద్వారా కూడా ఇది సోకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు, అలసట మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు.ఈ వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కోవిడ్ లాగా ఒక మనిషి నుండి మరో మనిషికి అత్యంత వేగంగా వ్యాపించదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లోకి ఎలుకలు రాకుండా చూసుకోవడం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉండవచ్చని సూచిస్తున్నారు.
వైరస్ నియంత్రణకు గాను ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఓడరేవులు, విమానాశ్రయాల్లో నిఘా పెంచాలని ఆదేశించింది.