ఆర్టీఐ పై చీఫ్ కమీషనర్ విస్తృత ప్రచారం

Written by TV2O TELUGU

Published on:

ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో లో సమాచార హక్కు చట్టం RTI పై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో నిర్వహించారు, సంస్థకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టం అమలు విధానం, పారదర్శకత, ప్రజలకు సమాచారం అందించే బాధ్యత వంటి అంశాలపై సదస్సులో విపులంగా చర్చించారు. ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ వజ్జా శ్రీనివాస రావు అధ్యక్షతన కార్యక్రమం సాగింది. ఇన్ఫర్మేషన్ కమీషనర్ రెహానా బేగం కూడా పాల్గొని RTI చట్టం ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (JMD), డైరెక్టర్లు, సూపరిండెంట్ ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్స్ తదితరులు పాల్గొని, సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రజలకు సమయానికి, సరైన సమాచారం అందించడంలో ప్రభుత్వ సంస్థల పాత్ర కీలకమని, RTI చట్టం ద్వారా పారదర్శకత పెంపొందుతుందని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా అధికారుల్లో అవగాహన పెంపొందడంతో పాటు, సమాచార హక్కు చట్టం అమలులో మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Leave a Comment