
నెల్లూరు కు చెందిన షేక్ సుకుర్ అహ్మద్ అనే రైతు ఇటీవల మనుబోలు మండలం, కొలనుకుదురు గ్రామానికి చెందిన ఎలిమేటి రామసుబ్బమ్మ అను ఆమెకు చెందిన రొయ్యల చెరువును కొని,తన భార్య అయిన షేక్ నజీమా పేరున రాయించుకున్నాడు. ఎలిమేటి రామ సుబ్బమ్మ పేరున ఉన్న, ఎలక్ట్రికల్ సర్వీసును ను ఫిర్యాదు దారుడు అయిన షేక్ సుకుర్ అహ్మద్ తన భార్య అయిన నజీమా పేరుతో ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి 16-04-2026 తేదీన ఆన్లైన్లో అప్లై చేసినాడు. 150000 లంచం యిస్తే, పై అధికారులతో మాట్లాడి, ట్రాన్స్ఫర్ చేయిస్తానని, మనుబోలు మండలం, బద్దెనవోలు వెంకన్నపాళెం గ్రామానికి చెందిన లైన్ మెన్ అయిన మల్లె సురేష్ హామీ ఇచ్చి, అదే రోజున 50,000 లంచం తీసుకొని, మిగతా లక్ష రూపాయలు మరుసటి రోజున అనగా 17-04-2026 తీసుకొనిరమ్మని, చెప్పినాడు. 17 వ తేదీన లక్ష రూపాయలు డబ్బులు ఇవ్వలేదని, ఆన్లైన్ అప్లికేషన్ ను చేయించాడు. తరువాత రైతు వెళ్లి లైన్ మెన్ రమేష్ ను అడుగగా, ముందు లక్ష రూపాయలు ఇవ్వు, తర్వాత ఆన్లైన్లో మళ్ళీ అప్లై చేస్తే, మీ భార్య పేరున సర్వీస్ ను ట్రాన్స్ఫర్ చేయిస్తానని, అందులో భాగంగానే నేడు మధ్యాహ్నం మనుబోలు మండలం, కట్టువపల్లి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వద్ద లక్ష నగదు తీసుకునే సమయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు.