
బ్రేకింగ్ న్యూస్ అలెర్ట్
మే రెండవ తేదీన ఆంధ్ర ప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల శాఖ నుంచి మొబైల్‌లో హెచ్చరిక శబ్దం వినిపిస్తుందని అ శబ్దం వచ్చినప్పుడు భయపడవద్దని, ఇది టెస్ట్ అలర్ట్ మాత్రమే అని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. ఏపీలో సెల్ బ్రాడ్‌కాస్ట్ టెస్ట్ అలర్ట్ నిర్వహణ ఉ.11.15 నుంచి మ.12.15 వరకు మొబైల్ ఫోన్లకు సెల్ బ్రాడ్‌కాస్ట్ టెస్ట్ అలర్ట్ సందేశాలు వస్తాయని పేర్కొంది..
మొబైల్‌లో బీప్ సౌండ్, వైబ్రేషన్‌తో నోటిఫికేషన్ వస్తుందని విపత్తుల శాఖ అధికారులు వెల్లడించారు.. సాధారణంగా ఏపీలో రాజధాని అమరావతి ఏర్పడినప్పటి నుంచి వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి అకాల వర్షాలు ఉరుములు మెరుపులు పిడుగులకు సంబంధించిన సందేశాలను రాష్ట్ర విపత్తుల శాఖ కార్యాలయం నుంచి ప్రజలకు అధికారులకు అందిస్తుంది.. ప్రమాదాల నుంచి ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ సందేశాలు వస్తుంటాయి.. ఇదే తరహాలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే సౌండ్ అలర్ట్ ను విపత్తుల శాఖ ఈనెల రెండున సందేశాల రూపంలో బీప్ సౌండ్ లాగా ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా పంపించనున్నట్టు తెలిపారు..