పెళ్లికి డీజే… సౌండ్ వల్ల 140 కోళ్లు చనిపోయాయి.. కేసునమోదు..

Written by TV2O TELUGU

Published on:

పెళ్లిళ్లకు ఫంక్షన్లకు ప్రస్తుత కాలంలో డీజేల హోరు జోరుగా సాగుతోంది.. అత్యంత ఎక్కువ శబ్దంతో మోగే డీజేలా కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి… మనుషులకు సైతం హార్ట్ ఎటాక్ లు వచ్చి ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి… న్యాయస్థానాలు డీజే లను నిషేధించాలని ఆదేశాలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి… మనుషులకే కాదు పక్షులకు జంతువులకు కూడా ఈ డీజే ల వల్ల ప్రాణహాని ఉందని నిపుణులు చెప్తున్నారు.. ఇదే తరహాలో యూపీలో జరిగిన ఓ సంఘటన పోలీసు కేసుల వరకు వెళ్ళింది…
యూపీలోని సుల్తాన్‌పూర్‌లో డీజే శబ్దం కారణంగా 140 కోళ్లు మరణించాయని ఆరోపణలు వచ్చాయి. ఇటీవల బబ్బన్ అనే వ్యక్తి తన కుమార్తెకు వివాహం జరిపించాడు. అతను ఒక డీజేతో ఆమెను ఆమె అత్తగారి ఇంటికి పంపించాడు. ఆ ఊరేగింపు సాబిర్ అలీ అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారం పక్కగా సాగింది. ఆ శబ్దాల వల్ల తమ కోళ్లు చనిపోయాయని అలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెద్ద శబ్దాల వల్ల పక్షులకు, జంతువులకు గుండెపోటు రావచ్చని నిపుణులు అంటున్నారు..

Leave a Comment