
మంగ్లి పై వస్తున్న ఆరోపణలపై మంగ్లీ తమ్ముడు శివ చౌహన్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
గత ముప్పై రోజులుగా తమ పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు..
తమ అక్కపై వస్తున్న ఆరోపణలపై మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చానన్నారు..
తన ఫొటోలతో వస్తున్న ఆరోపణలు సరైనవి కాదన్నారు..
మధు రమావత్, హేమాకాంత్ రెడ్డి లు తీజ్ పండుగ కోసం మాట్లాడడానికి వచ్చారన్నారు..
మా అక్క తన నెంబర్ ఇచ్చి తనతో మాట్లాడమని చెప్పారు..
తాము ఎమ్మెల్యే ప్రోగ్రాం కు వెళ్లి వస్తున్న తరుణంలో మా విలేజీ కి రమ్మనడం తో వెళ్లడం జరిగిందని చెప్పారు..
తాము డిన్నర్ చేసిన తరువాత ఈ ఫోటో దిగడం జరిగిందన్నారు..
వెంచర్ ఆఫీస్ ప్రారంభానికి అక్కను రమ్మనడం తో అక్క ఇలాంటి ప్రోగ్రాం కు రాము అని చెప్పారు.
అక్క రాకపోవడంతో తనను రమ్మని పిలిచి అక్కడ జూన్ 9 న ఈ ఫొటోస్ దిగడం జరిగిందన్నారు..
జూన్ 10న అక్క బర్త్‌డే ఉంది అన్ని ఆరెంజె మెంట్స్ చూసుకోవాలని వెళ్ళేటప్పుడు తనతో వచ్చిన డ్రైవర్స్ తన ఫొటాస్ దిగారన్నారు..
ఈ ఫొటోస్ చూపిస్తూ తనకు డబ్బులు ఇచ్చామని చెప్పి తమపై దుష్ప్రచారం చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ ఆఫీస్ కు ఆఫీస్ కవలనడం తో తనకు చెందిన ప్లాట్ చూపించామని,…అదే ప్లాట్ కొనేందుకు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాక వాళ్ళతో పరిచయం బాగా కొనసాగిందన్నారు..
హేమాకాంత్ రెడ్డి ,రమాకాంత్ ఇద్దరు తాను లేనప్పుడు తమ ఊరికి వచ్చారని,
తమకు ఈ మైక్రో స్కామ్ కు ఎలాంటి సంబంధం లేదని,…తాను నమ్మే హనుమాన్ పై , సేవాలాల్ పై ఒట్టు వేసి చెపుతున్న ఈ ఆరోపణలు నిజం కాదన్నారు..
మంగ్లి పై కుట్రపూరితంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని,
ఈ ఇస్ష్యు వల్ల తన కుటుంబానికి పరువు నష్టం కలిగిందని,
తమపై పోలీసుల నుండి క్లిన్ చిట్ వచ్చక లీగల్ గా న్యాయస్థానం ద్వారా తమ పోరాటం తప్పక కొనసాగిస్తామన్నారు..
బాధితుల తరుపున మేము పోరాడూతాం..నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది.. ఇవన్నీ ప్రజలు గమనించాలని కోరారు..
14సంవత్సరాలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కష్టపడి వచ్చాము…తమపై నిరాదరమైన ఆరోపణలు చేస్తున్నారు.
మైక్రో ఫైనాన్స్ స్కామ్‌తో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు..
60–90 కేసుల్లో ఎక్కడా తమ పేర్లు లేవని పేర్కొన్నాడు.
బాధితులు కూడా తమ పేర్లు ప్రస్తావించలేదని చెప్పాడు.
అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలు నిరాధారమని అన్నారు.
మీడియా ద్వారా తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించాడు.
కోర్టులో పోరాడకుండా మీడియా ముందుకు రావడం సరైనది కాదని వ్యాఖ్యానించాడు.
తాను ఎప్పుడూ బెదిరింపులు చేయలేదని స్పష్టం చేశారు.
కాల్ లేదా మెసేజ్ కూడా చేయలేదని చప్పాడు.
సోషల్ మీడియాలో మంగ్లీని టార్గెట్ చేస్తున్నారు
చట్టం ముందు వాస్తవాలు బయటపడతాయని నమ్మకం ఉంది..