
పల్నాడు జిల్లా చిలకలూరిపేట :
చీరాల ఓడరేవు – నకరికల్లు అడ్డరోడ్డు NH 167A మార్గంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను రూరల్ ఎస్సై జి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఒక్కొక్కరికి 10,000/- రూపాయల చొప్పున మొత్తం 30,000/- రూపాయల జరిమానా విధించింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించి మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు…