
స్వర్ణకారులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వైసీపీ నేత తోలేటి శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి కృష్ణ
భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా దేశ ఆర్థిక పరిస్థితుల దృశ్య దేశ ప్రజలు ఎవరు ఒక సంవత్సరం పాటు బంగారాన్ని కొనవద్దు అని చేసిన ప్రకటన పై స్పందించారు…
ఇప్పటికే బంగారం రేటు విపరీతంగా పెరిగి పనులు లేక కార్పొరేట్ సంస్థల పోటీ తట్టుకోలేక స్వర్ణకారుల పరిస్థితి దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో
ప్రధాని ప్రకటన మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా చేశారని అన్నారు.
రానున్న సంవత్సర కాలం పాటు బంగారం కొనుగోళ్లపై ప్రధాని ప్రకటనతో
తీవ్రంగా తగ్గే అవకాశం ఉన్నందున ఈ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల కుటుంబాలు
ఈ స్వర్ణవృత్తి పైన ఆధారపడి జీవిస్తున్నారని, ఈ సందర్భంలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్వర్ణకారులకు వడ్డీ లేని సబ్సిడీ రుణాలు
మరియు ప్రత్యామ్నాయంగా ఆదాయ మార్గాలు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న ఇంతవరకు చేతివృత్తుదారులకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేదన్నారు..
గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగనన్న తోడు, చేదోడు పథకాలతో చేతివృత్తుదారులను ఆదుకున్న సందర్భం గుర్తు చేశారు.
స్వర్ణకారులు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు ఆనవాళ్లు కాబట్టి స్వర్ణకారుల యొక్క భవిష్యత్తును కాపాడాలన్నారు..
కావున స్వర్ణకారుల జీవన విధానం మెరుగుపరిచేందుకు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.