శేషాచల అడవుల్లో కార్చిచ్చు.. భయం గుప్పిట్లో జీవకోన ప్రజలు

Written by TV2O TELUGU

Published on:

తిరుపతి సమీపంలోని శేషాచల అడవుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక జీవకోన ప్రాంతానికి ఆనుకుని ఉన్న కొండల్లో భారీగా కార్చిచ్చు రాజుకుంది. మధ్యాహ్నం ప్రారంభమైన ఈ మంటలు క్రమంగా కొండంతా వ్యాపిస్తున్నాయి. అటవీ ప్రాంతం నుంచి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. గాలి తీవ్రతకు మంటలు జనావాసాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని జీవకోన ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే మంటలు పెట్టారా.. లేక ఎండ తీవ్రత వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో వివరాలు తెలియాల్సి ఉంది. మంటలు కిందకు రాకముందే అటవీశాఖ అధికారులు స్పందించి, వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Comment