పురోగతిపై రాష్ట్ర 20 సూత్రాల అమలుపై సమీక్ష….

Written by TV2O TELUGU

Published on:

కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అమలు చేస్తున్న 20 సూత్రాల కార్యక్రమం పురోగతిపై రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్‌ లంక దినకర్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ వి. అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాల లక్ష్యాలు, పురోగతిపై ఆరా తీశారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమాల అమలులో జాప్యం లేకుండా నిర్ణీత లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

Leave a Comment