కొడాలి నానితో చనువు.. గుడివాడ వన్‌టౌన్‌ ఎస్ఐపై బదిలీ వేటు

Written by TV2O TELUGU

Published on:

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న వై.వి.వి. సత్యనారాయణపై బదిలీ వేటు పడింది. ఆయనను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మాజీ మంత్రి కొడాలి నానితో ఎస్ఐ సత్యనారాయణకు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే ఈ చర్య తీసుకున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, బదిలీకి సంబంధించి అధికారికంగా వెల్లడించిన కారణాలు ఏవన్నది స్పష్టత రావాల్సి ఉంది.ఎస్ఐను వీఆర్‌కు పంపడంతో గుడివాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు కొత్త ఎస్ఐను నియమించే అవకాశం ఉంది. తాజా ఉత్తర్వులు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారాయి.

Leave a Comment