మంగళగిరి పట్టణ ప్రజలకు మంచినీటి కొళాయిల ద్వారా కొద్దిరోజులుగా త్రాగునీరు రంగు మారి సరఫరా అవుతోంది. ఫలితంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విరేచనాలు, వాంతులు, జ్వరాలతో బాధపడుతున్నామని నీరు త్రాగిన పలువురు వాపోతున్నారు. రంగు మారిన బురద నీరు వస్తున్న క్రమంలో ముందస్తు సూచనలు చేయటం వంటి పరిస్థితులు లేవు. క్లోరినేషన్ సక్రమంగా జరగటం లేదని విమర్శలు ఉన్నాయి. ఇకనైనా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు సరఫరా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.