
విశాఖపట్నం :
ఏపీ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది.
విశాఖపట్నంలో ప్రభుత్వం కేటాయించిన 20ఎకరాల్లో ₹750 కోట్ల పెట్టుబడితో తన కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ విస్తరణ ద్వారా సుమారు 7,000 మంది యువతకు కొత్తగా
ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
కేవలం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కే పరిమితం కాకుండా,ఇక్కడ ‘ITEN’ క్యాంపస్ ను ప్రారంభించి బిజినెస్
ప్రాసెస్ మేనేజ్మెంట్ సేవలను కూడా అందించనుంది.