నిత్యం వందలాది వాహనాలు ఆ రోడ్డు వైపు నుండే…

Written by TV2O TELUGU

Published on:

నిత్యం వందలాది వాహనాలు ఆ రోడ్డు వైపు నుండే ప్రయాణం చేస్తుంటాయి. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు నిత్యం ప్రయాణం చేసే రహదారి అది. ఎం టి ఎం సి పరిధిలోని రూరల్ గ్రామాలకు ముఖద్వారం గా ఉన్న కుంచనపల్లి ప్రాతూరు రోడ్డు, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, వంగవీటి మోహనరంగారావు ముఖద్వారం క్రింద రోడ్డును అడ్డంగా తవ్వేశారు. మురుగునీరును తాడేపల్లి వైపు నుండి ఆంధ్ర రత్న పంపింగ్ స్కీం పంట కాలువలో మురుగు మళ్ళించేందుకు రోడ్డును అడ్డంగా తవ్వడంతో నిత్యం ఏదో ఒక వాహనం ఆ గాడిలో పడి రిపేరుకు గురవుతుంది. ఇటీవల అధిక వర్షాలు కురిసి రోడ్డుపల్లంగా ఉండడంతో అక్కడే వర్షపు నీళ్లు నిలబడుతున్నాయి. రోడ్డుకు అడ్డంగా గాడి తీసింది ఎవరైనాప్పటికీ, ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఆ గాడులను పూడ్చకపోవడంతో అటువైపుగా ప్రయాణం చేసే ద్విచక్ర, భారీ వాహనాలు దారులు, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గాడి తీసి 20 రోజులు అవుతున్న ఇప్పటికీ అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో అక్కడ ప్రమాదాలు మరింత జటిలమయ్యే పరిస్థితి దాపురిస్తుంది. మరొక వారం రోజులలో పాఠశాలలు, కళాశాలలు పున ప్రారంభం కానున్నాయి. స్కూల్ మరియు కళాశాలల బస్సులతో రద్దీ కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. తక్షణం సంబంధిత అధికారులు పొంచి ఉన్న ప్రమాదం అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టకపోతే స్థానిక ప్రజలు ప్రమాదాల బారిన పడే పరిస్థితి ఏర్పడుతుంది.

Leave a Comment