సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఓ సమోసాల విక్రేత

Written by TV2O TELUGU

Published on:

రైలు ప్రయాణాల్లో సమోసాలు, బజ్జీలు, స్నాక్స్ కొనడం చాలామందికి అలవాటు. జర్నీ బోర్ కొట్టకుండా ఏదైనా తినాలనిపిస్తే వెంటనే ప్లాట్‌ఫామ్ లేదా ట్రైన్‌లో తిరిగే వాళ్ల నుంచి కొనేస్తుంటారు. కానీ ఆ ఫుడ్ ఎంతవరకు పరిశుభ్రంగా ఉంటుంది అన్న విషయం ఎప్పుడైనా ఆలోచించారా? తాజాగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రమ్చూస్తే మాత్రం రైలులో ఏదైనా తినే పదార్థాలను కొనాలనే ఆలోచన వస్తే కచ్చితంగా ఆగిపోవడం ఖాయం.

సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఓ సమోసాల విక్రేత కదులుతున్న రైలు కోచ్ తలుపు దగ్గర కూర్చుని మొబైల్‌లో మాట్లాడుతున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ అతను కూర్చున్న విధానమే ఇప్పుడు చర్చకు దారితీసింది. తాపీగా కూర్చున్న అతను కస్టమర్లకు సమోసాలు విక్రయించే ట్రైపైనే కాళ్లు పెట్టి కూర్చున్నాడు. అందులో నిండుగా సమోసాలు కూడా ఉన్నాయి. ఇది గమనించి ఓ రైల్వే ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు.ఈ వార్తచూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment