దేశంలోనే మొట్ట మొదటి డెక్స్‌పాడ్స్ పరికరం వినియోగంపై మంత్రితో చర్చ

Written by TV2O TELUGU

Published on:

క్రీడా రంగంలో నూతన సాంకేతిక ఆవిష్కరణ లకు ప్రోత్సాహం

విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న బాట్‌ఫోర్జ్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమి టెడ్ సంస్థ క్రీడాకారుల కోసం అభివృద్ధి చేసిన డెక్స్‌పాడ్స్ పరికరాన్ని రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సచివాల యంలోనీ తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ సేల్స్ ఆఫీసర్ శీలం శ్రీహర్ష మాట్లాడుతూ, రియాక్షన్ ట్రాకింగ్, స్పోర్ట్స్ పనితీరు అంచనా, శాస్త్రీయ శిక్షణ విధానాలు, ప్రతిభ గుర్తిం పు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధిలో డెక్స్‌పాడ్స్ వంటి ఆధునిక సాంకేతిక పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించా రు. మేక్ ఇన్ ఇండియా లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతికతతో ఈ పరికరాన్ని రూపొందించి నట్లు, దేశంలోనే ఈ తర హా వినూత్న క్రీడా సాంకేతి క పరికరాల్లో ఇది ప్రత్యేక మైనదని మంత్రికి తెలిపా రు. క్రీడాకారులు, కోచ్‌లు, స్పోర్ట్స్ అకాడమీలు, విద్యాసంస్థలు, శిక్షణ కేంద్రాలకు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రతినిధులు పేర్కొన్నారు. క్రీడా అభి వృద్ధికి దోహద పడే వినూ త్న సాంకేతిక పరిజ్ఞానాల ను ప్రభుత్వం ప్రోత్సహిం చే దిశగా సహాయ సహకా రాలు అందిస్తామని రాష్ట్ర క్రీడా శాఖ ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్య క్రమంలో సంస్థ ప్రతి నిధు లు సీఈఓ రాజేష్, సిటి వో చైతన్య, సిఓఓ సెల్వేం దర్, తదితరులు పాల్గొన్నారు…………

Leave a Comment