
దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు మంత్రాన్ని ప్రోత్సహిస్తున్న వేళ, సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది.
సర్వోన్నత న్యాయస్థానం ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా సోమవారం, శుక్రవారం రోజుల్లో కేసుల విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సర్క్యులర్ జారీ చేసింది.