72 గంటల్లో అల్ప పీడనం…

Written by TV2O TELUGU

Published on:

శ్రీలంక మీదుగా ఉన్న ఆవర్తనం రానున్న 72 గంటల్లో అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో వాతావరణ సమాచారాన్ని తెలియజేశారు విపత్తుల శాఖ అధికారులు..
రాబోయే రెండు మూడు రోజుల్లో ఏపీ లో కోస్తా ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రాలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాలలో తెల్లవారుజామున, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు..అదే సమయంలో ఉత్తరాంధ్రలోని వైజాగ్ మరియు మధ్య ఆంధ్రలోని విజయవాడ-గోదావరి ప్రాంతాలలో ఈ రోజు, రేపు వర్షాలు తగ్గి సోమవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డాక మళ్లీ పెరుగుతాయని తెలిపారు.. వాతావరణలో మార్పుల వల్ల అల్పాపీడనం ఎటు కదులుతుందనే దానిపై పూర్తి స్పష్టత ఎప్పటిలాప్పుడు సమాచారం అందిస్తామని తెలిపారు..

Leave a Comment