సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు….

Written by TV2O TELUGU

Published on:

భారతీయ సాంప్రదాయాన్ని ప్రజల్లో మరింత ఇనుమడింప చేసేందుకు ఈనెల
17 న సాంప్రదాయ వస్త్రధారణ పోటీలను నిర్వహిస్తున్నట్లు కాసుల పురుషోత్తమ కవి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కాసుల కృష్ణంరాజు తెలియజేశారు. కాసుల పురుషోత్తమ కవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతి సాంప్రదాయక కార్యక్రమాలను వివిధ వేదికలపై నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.. ఇందులో భాగంగా మే నెల 17న గుంటూరు వేదికగా సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించ తలపెట్టినట్లు చెప్పారు.. నగరంలోని అరండల్ పేట 2/2 లో గల హోటల్ లీలా లో సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొని సాంప్రదాయ వస్త్రధారణ ప్రతిభను ప్రదర్శించి గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్టు తెలిపారు.. మొదటి ప్రైజ్ – 5116. రెండో ప్రైజ్ -2116., మూడవ ప్రైజ్ -1116 రూపాయలు అందివ్వనున్నట్టు తెలిపారు.. ఈ పోటీల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదని ఫ్రీ ఎంట్రీ తో దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు.. ప్రతి దరఖాస్తు దారునికి కాసుల పురుషోత్తమ కవి ఫౌండేషన్ ద్వారా వేంకటేశ్వర స్వామి చిత్ర పటం అందివ్వనున్నట్టు తెలిపారు.. వివరాలకు +916300303844 రాజగోపాల్ ను సంప్రదించాలని పేర్కొన్నారు..

Leave a Comment