
వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఘనవిజయం – ప్రజా తీర్పు చరిత్రాత్మకం
15 ఏళ్ల పాలనకు చెక్ – ఓటుతో మార్పు తీసుకొచ్చిన ప్రజలు
మమతా పాలనకు ముగింపు పలికిన ప్రజలు
సనాతన ధర్మానికి విజయ ఘంటికలు మోగించిన బెంగాల్ ఓటర్లు
దేశవ్యాప్తంగా బీజేపీ విజయోత్సాహం – ప్రజల తీర్పు స్పష్టం: రామకృష్ణ యాదవ్
వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించడంపై దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా ఓబీసీ జోనల్ ఇంచార్జ్ తుల్లిమిల్లి రామకృష్ణ యాదవ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న నిరంకుశ పాలనకు వెస్ట్ బెంగాల్ ప్రజలు ఓటు ద్వారా ముగింపు పలికారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న నియంతృత్వ ధోరణులు, చొరబాటుదారులకు ప్రోత్సాహం, ఓటు బ్యాంక్ రాజకీయాలు వంటి అంశాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసి, బీజేపీకి భారీ మద్దతు అందించారని తెలిపారు. ముఖ్యంగా సరిహద్దు జిల్లాలైన ముర్సీదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్ ప్రాంతాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు.హిందూ సమాజంపై దాడులు జరిగినా ప్రభుత్వం స్పందించలేదని, మైనారిటీలకు మాత్రమే మద్దతు ఇచ్చిన పాలనపై ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. చట్టపరమైన హెచ్చరికలను పట్టించుకోకుండా సాగిన పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలుకుతూ వెస్ట్ బెంగాల్లో 194 సీట్లు, అస్సాంలో 100కు పైగా సీట్లు, పుదుచ్చేరిలో 18కు పైగా సీట్లు సాధించినందుకు ఆయా రాష్ట్రాల ప్రజలకు బీజేపీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజాస్వామ్య విజయమని, దేశంలో సనాతన ధర్మం సాధించిన విజయంగా భావిస్తున్నట్లు రామకృష్ణ యాదవ్ పేర్కొన్నారు.