
బాపట్ల జిల్లా బాపట్ల సూర్యలంక బీచ్ ని గోవా బీచ్ తరహాలో తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బాపట్ల పార్లమెంటు సభ్యులు మరియు పార్లమెంట్ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు.
శనివారం, సూర్యలంక బీచ్ లో జరిగే అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ మరియు బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ రాజు పరిశీలించారు. సూర్యలంక బీచ్ లో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను పార్లమెంట్ సభ్యులకు మరియు శాసనసభ్యులకు జిల్లా కలెక్టర్ మ్యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో వాటిని వివరించారు. సూర్యలంక బీచ్ లో పర్యాటకుల కొరకు పురుషులకు, మహిళలకు వేరువేరుగా ఏర్పాటుచేసిన స్నానపు గదులను, ఆహార పదార్థాల కొరకు ఏర్పాటు చేసిన షాపులను,పర్యాటకుల వాహనాల పార్కింగ్ సంబంధించి నిర్దేశించిన స్థలమును పరిశీలించారు.