దటీజ్…చింతమనేని ప్రభాకర్…. ఆపదలో ఆపన్న హస్తం…

Written by TV2O TELUGU

Published on:

*నాయకత్వ లక్షణాలు అంటే ప్రెస్ మీట్ లలో, సభలలో అసత్యాలు మాట్లాడటం, దొంగే దొంగ దొంగ అని అరవటం, తిమ్మిని బమ్మిని చేసి చెప్పే వాడు కాదు, నిత్యం క్షేత్ర స్థాయిలో ప్రజలకు అండగా ఉండేవాడు, ప్రజల్లోనే జీవించేవాడు ..ఇవే కదా అసలైన నాయకుని లక్షణాలు అంటున్న దెందులూరు నియోజకవర్గ ప్రజలు…

మరోసారి తన మానవత్వం చాటుకున్నరు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. దెందులూరు మండలం గాలాయగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వృద్ధుడిని అటుగా వెళ్తూ చూసి చలించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరు క్షణం కూడా ఆలస్యం చేయకుండా క్షతగాత్రుడిని అతని కుటుంబ సభ్యులను వెంటనే తన సొంత కారులో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చొరవ చూపారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ .
నాయకుడంటే దోచుకునేవాడు కాదు, స్వార్ధం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేవాడు కాదు, ప్రజలకు పెద్ద దిక్కుగా నిలబడి పాలించేవాడు, ప్రతినిత్యం జనంతోనే జీవిస్తూ , ఆ జనం కోసమే బ్రతికేవాడు, తన జీవితంలో అగ్రభాగం ప్రజలకు సేవలు అందించటమే నాయకుడి లక్షణం అనే నినాదాన్ని వాస్తవ రూపంలో ఆచరించి చూపే నిజమైన ప్రజా నాయకుడిలా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు..
దెందులూరు మండలం గాలాయగూడెం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అదే సమయంలో అటుగా వెళుతున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెంటనే తన కాన్వాయ్ ని ఆపి బాధితుడు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రుడికి, అతని బంధువులకు అధైర్య పడవద్దు అంటూ తను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే తన సొంత కారులో క్షతగాత్రుడిని అతని బంధువులతో కలిసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. దీంతో క్షతగాత్రుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Comment