మూడు దశల్లో.. ముచ్చటగొలిపేలా

Written by TV2O TELUGU

Published on:

ఆధునికత ఉట్టిపడేలా.. బిట్స్ పిలానీ అమరావతి క్యాంపస్ డిజైన్లను రూపొందించిన ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ ఎడిఫైస్ తొలి దశ భవనాలకు రూ.1,250 కోట్లు వెచ్చించనున్న సంస్థ

ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలానీ రాజధాని అమరావతిలో
ఏర్పాటు చేస్తున్న క్యాంపస్ ని ఐకానిక్ గా నిర్మించబోతోంది. క్యాంపస్ మాస్టర్లోన్, భవనాల డిజైన్లను ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ ఎడిఫైస్.. నవ్యత ఉట్టిపడేలా రూపొందించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మర్, బిట్స్ పిలానీ ఛాన్స్లర్ కుమారమంగళం బిర్లా స్వయంగాపలు జాతీయ, అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థలతో ఆరునెలల పాటు సమీక్షించి, ఈ డిజైన్లను ఎంపిక చేశారు.

తొలి దశలో ఈ క్యాంపస్లో భవనాల నిర్మాణానికి రూ.1,250 కోట్లు, పరికరాల కోసం రూ.150 కోట్లు బిట్స్ పిలానీ వెచ్చించనుంది. మొత్తంగా అమరావతి క్యాంపస్లో రానున్న 15 ఏళ్లలో మూడు దశల్లో రూ.4,500 కోట్లు వెచ్చించాలన్నది సంస్థ లక్ష్యం.

రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డును ఆనుకుని, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో బిట్స్ క్యాంపస్కు ప్రభుత్వం 70 ఎకరాలు కేటాయించింది. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి అటు కరకట్ట వరకు ఈ స్థలం ఉంది. ఈ ఏడాది. జనవరిలో స్థలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.

ఈ క్యాంపస్లో మూడు దశల్లో 36.46 లక్షల చ. అడుగుల నిర్మిత ప్రాంతం గల భవనాల్ని నిర్మించనున్నారు.

వాటిలో అకడమిక్, రీసెర్చ్ బ్లాక్, విద్యార్థుల హాస్టళ్లు, డైనింగ్ హాల్, ప్యాకల్టీ, సిబ్బంది నివాసగృహాలు, విద్యార్థులకు యాక్టివిటీ సెంటర్, షాపింగ్ సెంటర్, మెడికల్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్, అతిథిగృహం వంటివి ఉంటాయి.

మొత్తం 10 వేల మంది విద్యార్థులు

అమరావతి క్యాంపస్లో మూడు దశల్లో మొత్తం 10 వేల మంది విద్యార్థులు చదువుకునేలా తీర్చిదిద్దనున్నారు. తొలి దశలో 2,690 మందిని, రెండో దశలో 3,060 మందిని, మూడో దశలో 4,250 మందిని చేర్చుకునేలా ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్యాంపస్లో ఫేజ్-1లో బీఈ (మేజర్స్) లో సీఎస్ఈ, కృత్రిమ మేద (ఏఐ) అండ్ డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్ అండ్ రొబోటిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్ కోర్సులు అందజేస్తారు.

మైనర్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐఎంల్, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ అండ్ ఎల్ఎల్ఎమ్స్ కోర్సులు ఉంటాయి.

ఎంఈలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐఎంఎల్, డేటా ఇంజనీరింగ్ అండ్ ఎల్ఎల్ఎమ్స్, ఏఐ స్ట్రాటజీ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోర్సులు అందజేస్తారు.

డీప్ టెక్నాలజీస్కి సంబంధించిన అన్ని ఇంటర్ డిసిప్లినరీల్లో పీహెచ్ కోర్సులు. ఉంటాయి.

పీహెచీలో ప్రధానంగా అడ్వాన్స్డ్ ఏఐ అల్గారిథమ్స్ అండ్ ఆప్టిమైజేషన్, జనరేటివ్ ఏఐ ఆండ్ ఎల్ఎల్ఎమ్స్, ఆరోగ్య, బయోటెక్నాలజీ రంగాల్లో ఏఐ వినియోగం, అటానమస్ సిస్టమ్స్, స్మార్ట్ సిటీస్ వంటి రంగాల్లో పరిశోధనలపై దృష్టి పెడతారు.

Leave a Comment