
ఇరాన్ యుద్ధం పలు దేశాలపై తీవ్రంగా పడింది. దాయాది దేశం పాక్‌లో వంటగ్యాస్ సంక్షోభం తీవ్రమైనట్లు తెలుస్తోంది. వంటగ్యాస్ సరఫరా సరిగా లేక కరాచీ వాసులు ప్లాస్టిక్ బెలూన్లలో ప్రమాదకర స్థితిలో పైపుల నుంచి గ్యాస్ నింపుకుంటున్నట్లు మీడియాల్లో కథనాలు వెలుగుచూశాయి. ఇలా గ్యాస్‌ను స్టోరేజీ చేయడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ‘మొబైల్ బాంబులు’గా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.