గుంటూరు జిల్లా విద్యా రంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి – *ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్….

Written by TV2O TELUGU

Published on:

గుంటూరు జిల్లా విద్యా రంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి – *ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్….

గుంటూరు జిల్లాలో ప్రముఖ విద్యావేత్తలలో ఒకరైన పాతూరి కోటేశ్వరరావు మరణం పట్ల పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకు అత్యంత ఆప్తులు, సోదర సమానులైన పాతూరి కిరణ్ కుమార్ తండ్రి పాతూరి కోటేశ్వరరావు అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలందించిన కోటేశ్వరరావు జెకెసి కళాశాలలో హెచ్‌ఓడీగా, అనంతరం విజ్ఞాన్ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
అయన మరణం గుంటూరు జిల్లా విద్యావ్యవస్థకు, విద్యారంగానికి తీరని లోటని పేర్కొన్న ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. పాతూరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భగవంతుడు వారికి ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని, పాతూరి కోటేశ్వరరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు..

Leave a Comment