పొద్దున్నే 5 గంటలకు బెడ్ దిగితే చాలు.. మీ జీవితంలో ఆ అద్భుతాలు జరగడం ఖాయం!*

Written by TV2O TELUGU

Published on:

ప్రముఖ లైఫ్‌స్టైల్ నిపుణులు, సైంటిఫిక్ రీసెర్చ్‌లు సైకాలజిస్టుల నివేదికల ప్రకారం.. పొద్దున్నే లేవడాన్ని ప్రపంచవ్యాప్తంగా ‘5 AM క్లబ్’ అని పిలుస్తారు.రోజూ ఉదయం 5 గంటలకే బెడ్ దిగడం వల్ల మీ కెరీర్, ఆరోగ్యం ఆలోచనా విధానంలో ఊహించని కొన్ని మ్యాజిక్స్ జరుగుతాయని సైన్స్ సైకాలజీ చెబుతున్నాయి. మరి ఆ 5 అద్భుతమైన మార్పులు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.

  1. పీక్ ప్రొడక్టివిటీ (విపరీతమైన పని సామర్థ్యం):
    ఉదయం 5 గంటల సమయంలో విశ్వమంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు లేదా ఇంట్లో కుటుంబ సభ్యుల అరుపులు ఉండవు. ఈ నిశ్శబ్ద వాతావరణం వల్ల మీ మెదడు అత్యంత చురుగ్గా పనిచేస్తుంది. ఈ సమయంలో చదువుకునే విషయాలు లేదా ఆఫీస్ పనులపై ఏకాగ్రత 100 శాతం ఎక్కువగా ఉంటుంది. రోజంతా చేయాల్సిన పనులను ఈ 1-2 గంటల్లోనే చాలా వేగంగా పూర్తి చేయవచ్చు.
  2. మానసిక ఒత్తిడి మాయం
    ఆలస్యంగా లేచేవారి జీవితం ఎప్పుడూ పరుగుల లంకలా ఉంటుంది. ఆఫీస్‌కు టైమ్ అయిపోతుందనో, బస్సు దొరకదనో తీవ్రమైన కంగారు, ఒత్తిడితో రోజు స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడ స్టార్ట్ అయిన ఒత్తిడి ఆందోళన రోజంతా ప్రభావం చూపుతోంది… ఇంటికి వచ్చి రాత్రి పడుకున్న ఆ టెన్షన్ ఒత్తిడి నిద్రకు కూడా ఆటంకంగానే ఉంటుంది… అందుకే ఉదయాన్నే 5గంటలకు లేచే అలవాటు చేసుకుంటే ఒక రోజు మన పనులకు ఆలోచనలకూ సరిపడా సమయం ఉంటుంది… టెన్షన్ ఒత్తిడి లను జయించేందుకు అవకాశం ఉంటుంది…

Leave a Comment