
నటుడు భరత్ కాంత్, కెమెరామెన్ త్రిలోక్ మృతి
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నటుడు భరత్ కాంత్, కెమెరామెన్ త్రిలోక్ అక్కడికక్కడే మృతి చెందారు.ఇటీవల విడుదలైన ‘టెనెంట్’ సినిమాతో కథానాయకుడిగా గుర్తింపు పొందిన భరత్ కాంత్ వయసు 31 ఏళ్లు. అంతకుముందు ఆయన పలు చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించారు. కెమెరామెన్ త్రిలోక్ కూడా 31 ఏళ్ల వయసులోనే మృతి చెందారు. ఆయన పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.యువ ప్రతిభావంతుల అకాల మరణం టాలీవుడ్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.