
న్యూరాలింక్ మానవ మెదడు- యంత్రాల అనుసంధానంలో ఒక భారీ ముందడుగు వేసింది.వెంట్రుక కంటే పలుచని ఎలక్ట్రోడ్ థ్రెడ్స్ ను మెదడులో అమర్చే టెక్నాలజీతో ఆలోచనలతోనే కంప్యూటర్లు, పరికరాలను నియంత్రించే బీసీఐ (బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్) సిస్టమ్ను రూపొందించింది. ఈ రోబో మెదడులోని ఏ ప్రాంతంలో నైనా శస్త్రచికిత్సలు చేయగలదు. పక్షవాతం, ఎపిలెప్సీ, పార్కిన్సన్స్, డిప్రెషన్ వంటి వ్యాధులకు చికిత్స అందించే అవకాశం ఉంది. రక్తనాళాలకు హాని కలగకుండా పనిచేసే అధునాతన సెన్సార్లతో ఈ టెక్నాలజీ పరిశోధన దశలో ఉందని న్యూరాలింక్ వెల్లడించింది.