మీసాల రాయుడు పెండ్లి కుమారుడైన అయ్యేనే..

Written by TV2O TELUGU

Published on:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నేటి నుండి ప్రారంభమయ్యాయి.ఈ వార్షిక కళ్యాణలలో భాగంగా ఈరోజు శ్రీ స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెగా అలంకరించి ఎదుర్కోలు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు శ్రీ సీతా రాములు ఆంజనేయ వాహనంపై అన్నవరం పుర వీధుల్లో గ్రామ సేవ మహోత్సవాన్ని నిర్వహించి శ్రీ స్వామివారికి కల్యాణానికి పెండ్లి పెద్దలుగా వ్యవహరిస్తున్న శ్రీ సీతారాములు వెంట ఉండి గ్రామంలో ఉన్న గ్రామస్తులను, భక్తులందరినీ ఆహ్వానిస్తారు. ఈ ఊరేగింపులో వివిధ రకములైన సాంస్కృతిక కార్యక్రమాలు తోపాటు మ్యూజికల్ బ్యాండ్ గరగల నృత్యం వివిధ రకములైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.

Leave a Comment