‘చాట్స్ అడ్డా’ ఫ్రాంచైజీ ప్రారంభం…

Written by TV2O TELUGU

Published on:

‘చాట్స్ అడ్డా’ ఫ్రాంచైజీ ప్రారంభం…
దేశవ్యాప్తంగా సుమారు 30 నుంచి 40 ప్రాంతాల్లో విస్తరించిన చాట్స్ అడ్డా సంస్థ, విజయవాడలో తన తొలి ఫ్రాంచైజీని ప్రారంభించడం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ అభినందించ దగ్గ విషయమన్నారు. నగరంలోని బేసెంట్ రోడ్డు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘చాట్స్ అడ్డా’ ఫ్రాంచైజీని యువ నాయకుడు బోండా సిద్ధార్థ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో కళాశాల విద్యార్థులు, న్యాయవాదులు, షాపింగ్ కోసం వచ్చే ప్రజలకు అందుబాటు ధరల్లో, నాణ్యమైన 100 శాతం శాఖాహార ఆహారాన్ని అందించడానికి ముందుకు వచ్చిన చాట్ అడ్డ సంస్థ నిర్వాహకులను అభినందించారు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ సంస్థ, విజయవాడలో తన తొలి ఫ్రాంచైజీని ప్రారంభించి శాఖాహార ప్రియులను అరలించనుందన్నారు . ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, ఫ్రాంచైజీ నిర్వాహకుడు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Comment