
సాధారణ కోడి మాంసం విక్రయాలు నిత్యం జరుగుతుండొచ్చు, కానీ అడవి కోడిని (గ్రే జంగిల్ ఫౌల్) వేటాడితే మాత్రం జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. మన దేశంలో మాత్రమే కనిపించే ఈ అరుదైన పక్షులను వన్యప్రాణి రక్షణ చట్టం కింద కేంద్రం చేర్చింది. గింజలు, కీటకాలను ఆహారంగా తీసుకునే ఈ పక్షులు ప్రమాదం అని భావిస్తే చాలు.. చెట్లపైకి ఎగురుతాయి. కాబట్టి వీటిని వేటాడటం చట్టరీత్యా నేరం.